ఐరాస కార్యాలయంలో దీపావళి పండుగ ఘనంగా ..
- October 29, 2016
భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో చేసుకొనే దివ్వెల పండుగ దీపావళి తొలిసారిగా ఐక్యరాజ్యసమితిలోనూ వెలుగులు నింపింది. ఐరాస కార్యాలయంలో దీపావళి పండుగ ఘనంగా జరిగింది. ఈ పర్వదినం సందర్భంగా ఐరాస ప్రధాన కార్యాలయాన్ని దీపాలతో అలకరించి ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. 'హ్యాపీ దీవాలి' అంటూ దీపావళి శుభాకాంక్షలను పెట్టారు. ఐరాసలో దీపావళి పండుగ జరుపుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఇక దేశమంతటా దీపావళి పండుగ సంబరాలు హోరెత్తుతున్నాయి. ఆలయాలను దర్శించుకొని లక్ష్మీ, గణేష్ పూజలను నిర్వహిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖులు రణ్‌బీర్‌కపూర్, అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా, 'ట్రిపుల్ ఎక్స్' సినిమా జోడీ విన్ డీజిల్, దీపికా పదుకొనే, క్రికెటర్ విరాట్ కోహ్లి తదితరులు దేశప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









