ఎమిరేట్ ఏంజిల్, పిల్లల రాణి ఈ పాప’ అంటున్న రషీద్
- October 29, 2016
నిండా పదేళ్లు కూడా లేని పాప.. ఏకంగా దుబాయ్ రాజు, యూఏఈ ప్రధానమంత్రి అయిన షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్టోమ్‌ను ఇమిటేట్ చేసిన సంగతి తెలిసిందే. ఓ సభలో రాజు చేసిన ప్రసంగాన్ని అనుకరించి మాట్లాడిన పాప వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో కాస్తా రాజు దగ్గరకు చేరడం, పాప ముద్దు ముద్దు మాటలకు ఆయన కూడా మురిసిపోయి.. పాపను కలవాలనుకోవడం వెంటవెంటనే జరిగాయి. ‘ఈ పాపను కలవాలనుకుంటున్నాను. ఈమె వివరాలు తెలిసిన వాళ్లు చెప్పండి’ అని స్వయంగా ట్విటర్ వేదికగా రషీద్ అడిగిన వెంటనే.. వేల కొలది రిప్లైలు ట్విటర్లో వచ్చాయి. ఆమె పేరు ముహ్రా అల్ షేహీ అనీ, షార్జాహ్‌కు చెందిన పాప అని తెలిపారు. దీంతో షార్జాహ్‌లోని రాజు ఇంటికి పాప కుటుంబాన్ని అధికారులు తీసుకువచ్చారు. వారితో సరదాగా గడిపారు. పాప చదువు వివరాలు తెలుసుకున్నారు. పాపతో అక్కడ కూడా వీడియోలో ఇమిటేట్ చేసిన విధంగా మాట్లాడించుకున్నారు. సరదాగా రాజు ఇల్లంతా ఆ పాప తిరిగింది. గెంతులు వేస్తూ ఇల్లంతా సందడి చేసింది. ఒడిలో కూర్చోబెట్టుకుని పాపతో సరదాగా సంభాషించారు. షార్జాహ్ మోడల్ స్కూల్‌లో గ్రేడ్ వన్ చదువుతున్నట్లు షేహీ తండ్రి తెలిపారు. ఆ పాపకు తమ్ముడు అబ్దుల్లా (5), చెల్లి ఆస్మా(3) ఉన్నారు. ‘ నా కూతురు ముహ్రా అల్ షేహీతో ఓ రోజు గడిపాను. చాలా ఆనందంగా ఉంది. ఎమిరేట్ ఏంజిల్, పిల్లల రాణి ఈ పాప’ అంటూ రషీద్ ట్విట్ చేశారు. పాపతో సరదాగా గడిపిన ఫోటోలను కూడా పోస్ట్ చేశారు.. ఆ పాప మాట్లాడిన వీడియోను మీరూ చూడండి...
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







