రజనీ శివకుమార్‌కి రాసిన లేఖలో కొన్ని ఆసక్తికర విషయాలు....
- October 30, 2016
దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు స్వదేశంలోనే కాదు విదేశాల్లో కూడా బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. రీల్ లైఫ్‌లో ఎంత స్టైలిష్‌గా కనబడతారో, రియల్ లైఫ్‌లో అంత నిరాడంబరంగా ఉంటారు. తోటి నటులతో ఎంతో స్నేహంగా ఉంటారు. తమిళ సీనియర్ నటుడు శివకుమార్ (సూర్య, కార్తీల తండ్రి) 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయనకు రాసిన లేఖలో రజనీ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అంతపెద్ద సూపర్‌స్టార్ అయ్యుండీ తనలోని చెడు అలవాట్ల గురించి ప్రపంచానికి ఆ లేఖ ద్వారా తెలియజేశారు. 'ఆయన దగ్గర్నుంచి కెరీర్ తొలినాళ్లలో ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నాను. అప్పట్లో నేను ఆల్కహాల్, సిగరెట్లు మోతాదుకు మించి తీసుకుంటుండేవాడిని.గొప్ప నటుడిగా ఎదగాలంటే అలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలని శివకుమార్ నన్ను హెచ్చరించేవారు. ఆయనది మహోన్నత వ్యక్తిత్వం. చెడు అలవాట్లతో నేను ఆరోగ్యం పాడుచేసుకున్నాను. అయితే ఆయన ఇచ్చిన సలహాలు పాటించి శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారయ్యా.శివకుమార్‌కు దేవుడు ఆయురారోగ్యాలు అందించాలని కోరుకుంటున్నాన'ని రజనీ ఆ లేఖలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







