దీపావళి సందర్భంగా సైనికులకు శుభాకాంక్షలు : షారుక్‌

- October 31, 2016 , by Maagulf
దీపావళి సందర్భంగా సైనికులకు శుభాకాంక్షలు : షారుక్‌

బాలీవుడ్‌ కింగ్‌ఖాన్‌ షారుక్‌.. సైనికులకు ఓ చక్కటి కవితా సందేశాన్ని పంపాడు. దీపావళి సందర్భంగా సైనికులకు శుభాకాంక్షలు తెలుపుదామంటూ ప్రధాని మోదీ పిలుపుతో సందేశ్‌ టు సోల్జర్స్‌ పేరుతో సామాజిక మాధ్యమాల్లో ఓ ఉద్యమంలా నిర్వహించిన సంగతి తెలిసిందే. పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు అందులో చేరి తమ సందేశాలు పంపారు. తాజాగా షారుక్‌ ఖాన్‌ ట్విట్టర్‌ ద్వారా కవితాత్మకమైన పదాలతో సందేశం పోస్ట్‌ చేశారు.
'మన పాదాలు తివాచీలపై. వారి బూట్లు మట్టిపై. మన జీవితాలు సాధారణంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. కానీ వారి ముందు రోజుకో కొత్త సవాలు.. ఒత్తిడి ఉంటుంది.
వారు మనల్ని కాపాడుతున్నారు కాబట్టే మనం జీవిస్తున్నాం. మన హీరోల త్యాగాలు ప్రపంచానికి తెలీకుండా ఉండకూడదు. ఎందుకంటే మనల్ని కాపాడడానికి వారు పడే బాధేంటో మనం వివరించలేం. వారి వల్లే దేశం, మనం..సురక్షితంగా ఉన్నాం. కాబట్టి మా ప్రియమైన సైనికులారా.. మీకు, మీ కుటుంబానికి మరోసారి హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు'' అంటూ శుభాకాంక్షలు తెలిపాడు షారుక్‌.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com