తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో క్యాట్ బిర్యానీ...!
- October 31, 2016
చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ ఇలా రకరకాలుగా బిర్యానీలు చేస్తారని తెలుసు. కానీ తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో పిల్లుల్ని చంపి వాటి మాంసంతో క్యాట్ బిర్యానీ చేసి వడ్డిస్తున్నారు. ఈ అక్రమ బాగోతం చెన్నైలోని పల్లావరంలో వెలుగు చూసింది. జంతు సంరక్షణకు చెందిన ఓ స్వచ్చంద సంస్థ వాలంటీర్లు, చెన్నై పోలీసులు కలిసి ఈ అక్రమాన్ని బట్టబయలు చేశారు. క్యాట్ బిర్యానీ కోసం పిల్లుల్ని ఓ బోనులో బంధించి ఉంచారు. అయితే పోలీసులు దాడి చేసి వాటిని విడిపించారు. పిల్లుల ప్రవర్తనను చూసిన పోలీసులు షాకయ్యారు. ఆ పిల్లులు సాధారణ పిల్లుల్లా కాకుండా గోడపై బల్లి పాకినట్లు పాకుతున్నాయి. ఇందుకు కారణం అవి కొన్ని నెలలుగా బోనులో బంధించడమే అని జంతు సంరక్షణ కారులు అంటున్నారు. చెన్నైలో క్యాట్ బిర్యానీ అమ్మడం కొత్త కాదని గతంలో కూడా పలు హోటళ్ళలో ఇలాంటి బాగోతాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలియజేశారు. ఏది ఏమైనా చెన్నై వెళితే సాంబర్ ఇడ్లీ తినండి కానీ, బిర్యానీ మాత్రం తినకండి.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







