తెలంగాణా ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతి

- August 25, 2015 , by Maagulf
తెలంగాణా ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతి

మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి (67) కన్నుమూశారు. మంగళవారం ఉదయం ఎస్ఆర్‌నగర్‌లోని ఆయన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా కిష్టారెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. కిష్టారెడ్డి నారాణ్‌ఖేడ్ మండలం పంచ గ్రామంలో జన్మించారు. సర్పంచ్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కిష్టారెడ్డికి శివారాజ్‌షెట్కర్ రాజకీయ గురువు. బావ, దివంగత నేత, మాజీ ఎంపీ బాగారెడ్డి ద్వారా రాజకీయాల్లో పట్టు సాధించారు. 1977లోపంచగామ సర్పంచ్‌గా,1982లో నారాయణ‌ఖేడ్ సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1989లో నారాయణ్‌ఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మొదటిసారి గెలుపొందారు. ఇదే సమయంలో టీటీడీ బోర్డు సభ్యునిగా పనిచేసిన ఆయన 1994లో రెండో సారి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. 1999 జరిగిన ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిపొందారు. అలాగే 2009, 2014లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలుగుదేశం హయాంలో రెండు సార్లు పీఏసీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలోనూ కిష్టారెడ్డి అనేక కీలక పదువులు నిర్వర్తించారు. కిష్టారెడ్డి మరణవార్త తెలిసిన వెంటనే నారాయణ్‌ఖేడ్‌లో విషాదఛాయలు అలముకున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com