కొత్త జిల్లాల ఏర్పాటుతో పాస్‌పోర్టు సేవలకు అంతరాయం...
- November 01, 2016
తెలంగాణలో పాస్‌పోర్టు సేవలకు అంతరాయం ఏర్పడింది. జిల్లా పునర్విభజనతో ఎక్కడికి వెళ్లి పాస్‌పోర్టు తీసుకోవాలో తెలియక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కొత్త జిల్లాలో పాస్‌పోర్టు సేవలకు సంబంధించిన వ్యవస్థ లేకపోవడమే ఇందుకు కారణం. అయితే రెండు వారాల్లో సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు అంటున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో విదేశాలకు వెళ్లాల్సిన వారు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడి దాదాపు నెలరోజులు కావస్తున్నా ఇంకా పాస్‌పోర్టు సంబంధిత సేవలు గాడిన పడక పోవడమే ఇందుకు కారణం. పాస్‌పోర్టు దరఖాస్తులను పాత జిల్లాల అధికారుల వద్దకు తీసుకువెళ్తే, కొత్త జిల్లాల అధికారుల వద్దకు వెళ్లాలని చెబుతున్నారు.
అక్కడికి వెళ్తే ఇంకా సాఫ్ట్‌వేర్, హార్ట్‌వేర్ రాలేదని మరో రెండు వారాలు పడుతుందని చెబుతున్నారు. మధ్యలో విదేశాలకు వెళ్లాల్సిన ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది గల్ఫ్‌లో ఉపాధి అవకాశాలను కూడా కోల్పోతున్నారు. ఇటీవల రెండు జిల్లాల ఎస్పీలు ఎండార్స్ చేసి పంపించిన కొత్త జిల్లాల నుంచి దరఖాస్తు రాలేదన్న కారణంతో పాస్‌పోర్టును తిరస్కరించిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.
సాధారణంగా పాస్‌పోర్టులకు సంబంధించిన నివేదికను ఎస్పీలు ఆన్‌లైన్‌లోనే పంపించాలి. సంబంధిత సాఫ్ట్‌వేర్ రాకపోవడంతో కొత్త జిల్లాల ఎస్పీలు రిపోర్టులు పంపించలేకపోతున్నారు. పాత జిల్లాల ఎస్పీలు తమకు సంబంధం లేదంటున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ నుంచి కొత్త జిల్లాల ఎస్పీలకు హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అందలేదు.
అది వస్తే తప్పితే ఆన్‌లైన్‌లోనే పాస్‌పోర్టు దరఖాస్తులను పరిష్కరించడం సాధ్యంకాదు. ఇప్పుడు పాత జిల్లాల పేరుతోనే వస్తోన్న సాఫ్ట్‌వేర్‌తో కొత్త జిల్లాల పరిధిని ఎలా తేల్చాలన్న గందరగోళంలో విచారణ చేపట్టే పోలీసు అధికారులు ఉన్నారు. అయితే న్యూఢిల్లీ నుంచి హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రెండు వారాల్లో అందుతుందని విదేశాంగ శాఖ అధికారులు చెబుతున్నారు. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని అంటున్నారు.
జిల్లాలు చిన్నగా మారడంతో విచారణ ఒక్కరోజులోనే పూర్తై అదే రోజు ఎస్పీ ఆమోదంతో పాస్‌పోర్టు కార్యాలయానికి అప్‌లోడ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో కొత్త జిల్లాల్లో పాస్‌పోర్టు సేవలు గాడిన పడితే జారీ వేగం పుంజుకునే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!







