'భారతీయ సినిమాను అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకు నిధి ఏర్పాటు..
- November 01, 2016
భారతీయ సినిమారంగానికి ఎనలేని ప్రోత్సాహాన్ని అందజేస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖామంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ నెల 20 నుంచి 28 వరకు జరగనున్న 47వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం కర్టెన్‌రైజర్ కార్యక్రమం మంగళవారంనాడు జరిగింది. ఇందులో భాగంగా ఈ ఉత్సవానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదలచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, 'భారతీయ సినిమాను అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకు ఓ నిధిని ఏర్పాటుచేస్తున్నాం. తాము తీసిన సినిమాలను అంతర్జాతీయస్థాయిలో తీసుకెళ్లాలని అనుకునేవారికి ఈ నిధి నుంచి సాయం అందించడం జరుగుతుంది. మన ఆలోచనలను ఇతరులకు, ఇతరుల ఆలోచనలను మనం పంచుకుని నాణ్యమైన మంచి సినిమాలను నిర్మించేందుకు ఓ మంచిఫ్లాట్‌ఫామ్‌ను తయారుచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.మొత్తంమీద భారతీయ సినిమాకు ఎనలేని ప్రోత్సాహం అందిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గోవా ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డి.సౌజా, ఆ రాష్ట్ర మంత్రి రాజీవ్‌వర్ధన్‌రాథోర్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ.బాలుకు అవార్డుఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2016 అవార్డుకు ప్రముఖ గాయకులు ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు. గోవా అంతర్జాతీయ చిత్రోత్సవం ముగింపు వేడుకకు ముఖ్యఅతిథిగా ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!







