మెట్రో క్రేన్ కింద నలిగి ఓ అభాగ్యుడు మరణించాడు
- November 02, 2016
మెట్రో క్రేన్ కింద నలిగి ఓ అభాగ్యుడు మరణించాడు. అతనికి దాదాపు 50 ఏళ్ళ వయస్సుంటుంది. క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే అతడు మృతి చెందాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ లోని గాంధీభవన్ మొజాంజాహి మార్కెట్ వద్ద జరిగింది. పుట్ పాత్ పై నిద్రిస్తున్న అతనిపై క్రేన్ వెళ్ళింది. క్రేన్ భారీగా ఉండడంతో డ్రైవర్ కు ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్న వ్యక్తి కనిపించలేదని అంటున్నారు. అటుగా వెళుతున్న ప్రయాణీకులు గమనించి క్రేన్ డ్రైవర్ ను అప్రమత్తం చేశారని, అయితే అప్పటికే అతను మరణించాడని అంటున్నారు. క్రేన్ డ్రైవర్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలియలేదు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. - See more
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







