హీరో సూర్య సొంత తెలుగు చిత్రం
- August 25, 2015
తమిళంలోనే కాదు తెలుగులోనూ తిరుగులేని స్టార్‌డమ్ కలిగిన కథానాయకుడు సూర్య, దర్శకుడు పాండిరాజ్ కాంబినేషన్‌లో ప్రస్తుతం తమిళంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సూర్య సరసన అమలాపాల్ నటిస్తుండగా, తెలుగు అమ్మాయి బిందుమాధవి ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాని తమిళంలో సూర్య స్వయంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి కావచ్చిన ఈ చిత్రం తెలుగు హక్కుల కోసం తీవ్రమైన పోటీ నెలకొన్నప్పటికీ ఫ్యాన్నీ రేట్ చెల్లించి హక్కుల్ని పొందారు సాయిమణికంఠ క్రి యేషన్స్ అధినేత జూలకంటి మధుసూదన్‌రెడ్డి. కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పణలో శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ సంస్థతో కలసి ఆయన ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ సందర్భంగా జూలకంటి మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ ' తమిళంలో సూపర్‌స్టార్ సూర్య నిర్మిస్తున్న సినిమాను ఆయన సమర్పణలో తెలుగు ప్రేక్షకులకు అందించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎందరో పెద్ద నిర్మాతలు ఈ చిత్రం హక్కుల కోసం పోటీ పడినా మా మీద నమ్మకంతో హక్కులు మాకే ఇచ్చారు. ఇటీవలే 'జిల్లా' సినిమాని నిర్మించిన శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ అధినేతలు ప్రసాద్ సన్నితి, తమటం కుమార్‌రెడ్డి ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు' అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, ఛాయాగ్రహణం: బాలసుబ్రహ్మణ్య, సంగీతం: అర్రోల్ కొర్రెల్ల, కూర్పు: ప్రవీన్ కె.ఎల్. కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: పాండిరాజ్.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









