ఆ చిత్రం స్పూర్తితోనే చేశాం

- November 02, 2016 , by Maagulf
ఆ చిత్రం స్పూర్తితోనే చేశాం

అక్కినేని హీరో సుమంత్ నటించిన చిత్రం 'నరుడా డోనరుడా'. ఈ సినిమా నిర్మాణ వ్యవహారాలన్ని దగ్గరుండి మరీ చూసుకున్నాడు సుమంత్. 'క్షణం' సినిమాను పరిమితమైన బడ్జెట్లో అద్భుతమైన క్వాలిటీతో తెరకెక్కించారని.. తాము కూడా 'నరుడా డోనరుడా' విషయంలో అలాగే ప్రయత్నించామని సుమంత్ తెలిపాడు. ''మా సినిమాకు ఏం అవసరమో అదే సమకూర్చాం. ఖర్చు పెట్టుకునే స్థాయి ఉంది కాబట్టి.. ఏదైనా చేయడానికి మేం సిద్ధపడలేదు. క్షణం టీం చాలా తక్కువ బడ్జెట్లోనే సినిమాను పూర్తి చేయడం చూసి.. మేం కూడా అదే దారిలో ప్రయాణించాలనుకున్నాం. ఆ సినిమాకు పని చేసిన టెక్నీషియన్లనే మేమూ తీసుకున్నాం. ఫిలిం స్కూల్లో విద్యార్థులంతా కలిసి ఒక ప్రాజెక్ట్ చేసినట్లుగా ఈ సినిమాకు పని చేశాం.అందరూ తమ సామర్థ్యాల్ని పూర్తి స్థాయిలో వినియోగించారు. నటీనటులు కారవాన్లు సహా చాలా లగ్జరీస్ వదులుకున్నారు. అవేమీ లేకుండానే సినిమా పూర్తి చేయొచ్చని చూపించాం. ఇకపైనా ఇలాగే సినిమాలు చేయాలని ఉంది.

'క్షణం' యూనిట్ స్ఫూర్తితో మేం చేసిన ఈ ప్రయత్నం విజయవంతమైంది'' అని సుమంత్ చెప్పాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com