'చిలకమర్తి'కి అరుదైన పురస్కారం
- November 02, 2016
మందపల్లి మందేశ్వరస్వామి దేవస్థానం ఆస్థాన పంచాంగకర్త, తొలి ఆంగ్లపంచాంగ కర్త చిలకమర్తి ప్రభాకర శర్మ జ్యోతిష రంగానికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా 'జ్యోతిష ప్రపూర్ణ' బిరుదును అందుకున్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం జరిగిన సమావేశంలో మందేశ్వరదేవస్థానం చైర్మన్ బండారు సూర్యనారాయణమూర్తి, ఈఓ వెచ్చా దేవు ళ్లు, సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సతీమణి ఆకుల పద్మావతి, ఇతర అతిథుల చేతులమీదుగా చిలకమర్తి ప్రభాకర శర్మ ఈ బిరుదాన్ని అందుకున్నారు.ఎం.టెక్, ఎంబీయే చదివిన చిలకమర్తి భద్రాచలం దేవస్థానంలో జ్యోతిష విద్యను నేర్చుకుని తెలుగు, ఆంగ్ల భాషలలో ఏటా పంచాంగాలు వెలువరిస్తున్నారు.
శ్రీ మందేశ్వరస్వామి మహాత్మ్యం పుస్తకావిష్కరణ
'శనిదేవుని గురించి ప్రజలలో ఉన్న అపోహలు దూరం చేయడానికి ఈ పుస్తకం రచించాను అని గ్రంథకర్త చిలకమర్తి తెలిపారు. ఆయన తెలుగు, ఆంగ్ల భాషలలో రచించిన 'శ్రీమందేశ్వరస్వామి మహాత్మ్యం' పుస్తకాన్ని సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సతీమణి ఆకుల పద్మావతి బుధవారం ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. శనిగ్రహ పీడితులు ఉపశమనం పొందడానికి స్థలపురాణంతో పాటు శని స్తోత్రాలను పుస్తకంలో పొందుపరిచామన్నారు. గ్రంథ సమీక్ష చేసిన కవి, గాయకుడు ఎర్రా ప్రగడ రామకృష్ణ మాట్లాడుతూ శనిదశలో ఉన్నవారి భయాందోళనలను ఈ పుస్తకం దూరం చేస్తుందని తెలిపారు. మందపల్లి దేవస్థానం ఛైర్మన్ బండారు సూర్యనారాయణమూర్తి, కార్యనిర్వహణాధికారి వెచ్చా దేవుళ్లు, ఇతర ప్రముఖులు గ్రంథకర్తను సత్కరించారు. కొంపెల్ల సుబ్బరాయశాస్త్రి, బీజేపి నాయకులు వీరన్నచౌదరి తదితరులు పాల్గొన్నారు.




తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









