స్టాక్‌ మార్కెట్‌ పతనం.. పెరిగిన బంగారం, వెండి ధర

- November 03, 2016 , by Maagulf
స్టాక్‌ మార్కెట్‌ పతనం.. పెరిగిన బంగారం, వెండి ధర

స్టాక్‌ మార్కెట్‌ పతనంఅమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో సర్వే ఫలితాల ప్రభావం
జిల్లాలో నష్టపోయిన మదుపుదారులు పెరిగిన బంగారం, వెండి ధరఅమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యం లో సర్వే ఫలితాల వెల్లడితో బుధవారం స్టాక్‌ మార్కెట్‌ ఒడిదుడుకులకు గురైంది. పలు కంపెనీ షేర్లు పతనం కావడంతో పలువురు మదుపుదారులు నష్టపోయారు. మరోవైపు బంగారం, వెండి ధరలు పెరిగాయి. దీనితోపాటు అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం అక్కడ విద్యావకాశాలపై కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాలో స్థిరపడిన వారి భవితవ్యంపై కూడా కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి వందలాది మంది ఉపాధి, చదువుల కోసం అమెరికా వెళుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలపై జిల్లాలో ఆసక్తి నెలకొంది. కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌ అమెరికా అధక్ష ఎన్నికలపై సర్వే ఫలితాలు బుధవారం స్టాక్‌ మార్కెట్‌ను షేక్‌ చేశాయి. సెస్సెక్స్‌ 360 పాయింట్లు నష్టపోయింది.ఆరంభం నుంచి మార్కెట్‌ లో ఇదే ట్రెండ్‌ కొనసాగింది. ఒక దశలో సూచిక 400 పాయింట్లు నష్టపోయి తరువాత కొద్దిగా రికవరీ అయింది. బ్యాంకింగ్‌తో పాటు అన్ని రంగాల షేర్లు భారీగా పతనం కావడంతో జిల్లాలోని మదుపుదారులు నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. రానున్న రోజుల్లో మార్కెట్‌ ఏ విధంగా ఉంటుందనే భయంతో పెట్టుబడులను అమ్ముకునేందుకు సిద్ధపడుతున్నారు.పెరిగిన బంగారం, వెండి నెల రోజులుగా స్థిరంగా ఉంటున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బంగారం పది గ్రాములకు రూ.500 పెరిగింది. కేజీ వెండి రూ.800 వరకు పెరిగింది. బుధవారం పది గ్రామాలు మేలిన బంగారం రూ 31,300 పలికింది.కేజీ వెండి రూ 44,400కు చేరింది. రానున్న రోజుల్లో బంగారం ధర మళ్లీ రూ.32వేలు దాటవచ్చన్న ఊహగానాలు మార్కెట్‌లో వినిపిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com