మహేష్‌బాబు నూతన చిత్ర చిత్రీకరణ హైదరాబాద్ పరిసరాల్లో..
- November 03, 2016
మహేష్‌బాబు నూతన చిత్రం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ ఇంతవరకు 60 శాతం పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో జరుపుతున్న చిత్రీకరణ ఈ నెల 14 వరకు కొనసాగుతుందని, ఆ తర్వాత అహ్మదాబాద్‌లో ఓ భారీ షెడ్యూల్‌ను మొదలుపెట్టనున్నట్లు తెలిసింది. ఇందులో ఇంటిలిజెన్స్ ఆఫీసర్‌గా మహేష్ నటిస్తున్నారు.కెరీర్ పరంగా ఆయనకు 23వ చిత్రమిది. ఇదే వర్కింగ్ టైటిల్‌గా ప్రచారంలో ఉంది. అయితే కథానుసారంగా దీనికి ఓ మంచి టైటిల్‌ను నిర్ణయించేందుకు చిత్రబృందం కసరత్తు చేస్తోంది. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధులు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
మహేష్ సరసన ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయికగా నటిస్తుండగా, ప్రతినాయకుడి పాత్రను ఎస్.జె.సూర్య పోషిస్తున్నారు. హేరీస్‌జైరాజ్ సంగీతం, సంతోష్‌శివన్ ఛాయాగ్రహణం, కోలీవుడ్‌కు చెందిన అన్బు, అరసు అనే కవల సోదరులు కంపోజ్ చేస్తున్న ఫైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. తెలుగు, తమిళ భాషలలో రూపొందుతోంది.ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయాలన్న లక్ష్యంతో చిత్రబృందం ముందుకు సాగుతోంది
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







