ముగ్గురిపై చీటింగ్ కేసు పెట్టిన విజయ నిర్మల

- November 04, 2016 , by Maagulf
ముగ్గురిపై చీటింగ్ కేసు పెట్టిన విజయ నిర్మల

సూపర్ స్టార్ కృష్ణ భార్య , ప్రముఖ నటి, నిర్మాత , దర్శకురాలు విజయ నిర్మల పోలీసులను ఆశ్రయించారు. ఓ ముగ్గురు వ్యక్తులపై ఆమె చీటింగ్ కేసు పెట్టారు.
వివరాల్లోకి వెళితే.. శ్రీనివాస రాజు , సీతారామారాజు, భద్ర అనే వ్యక్తులకు 2007లో ఆమె కోటి రూపాయిలు అప్పుగా ఇచ్చారు. కొంత కాలం తర్వాత ఇచ్చిన డబ్బును తిరిగిమ్మని అడిగారు. అయితే రేపు మాపు అంటూ కాలం సాగదీస్తూ వచ్చారు ఆ ముగ్గురు. దీంతో అసహనానికి గురైన విజయ నిర్మల డబ్బులు ఇవ్వకపోతే పోలీసులను ఆశ్రయించాల్సి వస్తుందని ఈ మధ్య ఓ వార్నింగ్ ఇచ్చారు. దీంతో కోటి రూపాయిలకు ఓ చెక్ రాసి ఇచ్చారు ఆ ముగ్గురు. అయితే ఈ చెక్ బౌన్స్ అయ్యింది.
దీంతో ఇక లాభంలేదని నిర్ణయించుకున్న విజయ నిర్మల జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com