సెన్సార్ పనులు పూర్తిచేసుకున్న 'సాహసం శ్వాసగా సాగిపో'
- November 04, 2016
నాగచైతన్య, మంజిమా మోహన్ జంటగా గౌతమ్ వాసుదేవ్ మేనన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో'. లవ్ యాక్షన్ ఎంటర్టైనర్గా నిర్మించిన ఈ చిత్రాన్ని మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ను పొందింది. 'ఏ మాయ చేసావే' తర్వాత నాగచైతన్య, గౌతమ్వాసుదేవ్ మేనన్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాను నవంబరు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
విదేశాల్లో ఈ చిత్రం ప్రణీత మీడియా ద్వారా విడుదల అవుతోంది. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్. రెహమాన్, సినిమాటోగ్రఫీ: డాన్మాక్ ఆర్థర్, ఎడిటింగ్: ఆంటోని, ఆర్ట్: రాజీవన్, రచన: కోనా వెంకట్.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









