అల్ కాయిదా ముఖ్య నాయకుడు ఫరూక్ అల్ ఖతాని మృతి వార్త నిజమే
- November 04, 2016
అల్ కాయిదా ఉగ్రవాద సంస్థ ముఖ్య నాయకుడు ఫరూక్ అల్ ఖతాని మృతి వార్త నిజమే అని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ శుక్రవారం ధృవీకరించింది. కాబూల్ తూర్పు దిశగా 230 కిలోమీటర్ల దూరంలోని కునార్ ప్రావిన్స్‌లో అక్టోబర్ 23న జరిపిన వైమానిక దాడుల్లో అల్ ఖతాని మృతి చెందాడని పెంటగాన్ వెల్లడించింది. తమపై దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్న అంతర్జాతీయ ఉగ్రవాదులు, ఉగ్రవాదుల స్థావరాలపై అమెరికా చేపడుతున్న విజయవంతమైన అపరేషన్స్కు ఇదొక ఉదాహరణ అని పెంటగాన్ ప్రకటించింది.ఆఫ్గన్ ఈశాన్య ప్రాంతంలో అల్ కాయిదాను బలోపేతం చేయడానికి అల్ ఖతాని ప్రయత్నించాడని పెంటగాన్ పేర్కొంది. ఆఫ్గనిస్తాన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ, నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ(ఎన్డీఎస్) ఇదివరకే అల్ ఖతానీ మృతి చెందాడని ప్రకటించాయి.మరో అల్ కాయిదా లీడర్ బిలాల్ అల్ ఉతాబి సైతం మృతి చెందాడని ఎన్డీఎస్ తెలిపినప్పటికీ పెంటగాన్ ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







