హిమాచల్‌ప్రదేశ్‌లో లోయలో పడ్డ బస్సు
- November 05, 2016
హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. అదుపుతప్పి బస్సు లోయలో పడిపోవడంతో 18 మంది మృతి చెందారు. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి. గాయపడ్డ వారికి ఉచితంగా చికిత్స అందిస్తున్నామని రవాణా శాఖ మంత్రి జీఎస్ బాలి పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
కారు బోల్తా ఆరుగురు మృతి
రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ ముంబైలోని డోంగ్రి ప్రాంతంలో కారు మలుపుతిరుగుతూ అదుపుతప్పి బోల్తాపడింది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను జేజే ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డోంగ్రి పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు తెలిసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







