భార్య గొంతు కోసినందుకు ఎనిమిదేళ్ల శిక్ష
- November 05, 2016
మాజీ భార్య గొంతుపైనా, ఆమె పొట్టపైనా గాయపరిచి, తొమ్మిది సార్లు కొరడాతో దెబ్బలు కొట్టినందుకు కృష్ణన్ కరుణాకరన్(45) అనే వ్యక్తికి కోర్టు ఎనిమిదేళ్లుశిక్ష విధించింది. తన మాజీ భార్య లిఫ్ట్‌లో ఆమె తొమ్మిదేళ్ల పాపతో ఉండగా, కృష్ణన్ ఆమెపై దాడిచేసి, గొంతుపై గాయపరిచాడు. కృష్ణన్ అనే ప్రవాస భారతీయుడు సింగపూరువాసి అయిన బూమిచెల్వి రామస్వామి(38)ని 2011లో వివాహమాడారు. వారు పెళ్లయిన ఏడాదిలోపే విడివిడిగా జీవిస్తున్నారు. వారికొక పాప కూడా జన్మించింది. రామస్వామికి ఇదివరకే పెళ్లయ్యింది. ఆమెకు తొమ్మిదేళ్ల పాప కూడా ఉంది.
అక్టోబరు 2013లో సింగపూరులో వీసా గడువు పెంచుకునేందుకు తనకు సహకరించాలని కృష్ణన్ ఆమెని నమ్మబలికాడు. తమకు పుట్టిన పాపను చూడబోనని తెలిపాడు. అలా నమ్మించి కృష్ణన్ అక్టోబరు 27, 2013న ఆమె ఉంటున్న అపార్టుమెంట్ లిఫ్ట్‌లో దాడికి ఒడిగట్టాడు. ఘటననంతరం రక్తమోడుతున్న ఆమెను రక్షించేందుకు వాచ్మెన్ యత్నించాడు.
ఆమెకు వివాహేతర సంబంధముందన్న కారణంగానే తాము విడిపోయామని కృష్ణన్ మీడియాకి ప్రకటించాడు. డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహ్మద్ ఫైజల్ ఈ కేసును విచారణకు స్వీకరించారు. బాధితురాలిపై చేసిన ఆరోపణలు పూర్తిగా తప్పుుడు అభియోగాలని, కృష్ణన్ చేసిన ప్రకటనను కోర్టు తిరస్కరించింది. బాధితురాలిపై దాడి చేసినందుకు నిందితునికి అమె పట్ల కనీస పశ్చాత్తాపం కూడా లేదని ఫైజల్ అన్నారు.
జస్టిస్ చాన్ సెంగ్ ఆన్ తీర్పు చెబుతూ, తమ కూతురిని చూడాలనుకుంటే, నిందితుడు చట్ట ప్రకారం కొన్ని పద్ధతులను పాటించాలని, అలా కాకుండా చట్టాన్ని తన చేతుల్లో తీసుకుని, హింసకు పాల్పడటం సరికాదని వ్యాఖ్యానించారు. బాధితురాలికి పెద్దగా ఏమి గాయాలు కానందున, కృష్ణన్‌కి తక్కువ శిక్ష పడిందని, లేదంటే శిక్ష మరింత తీవ్రంగా ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగా హత్యాప్రయత్నం చేసాడని ఒక చార్జిషీటు, బెదిరించినందుకు మరో చార్జిషీటు కృష్ణన్‌పై దాఖలయ్యాయి. బూమిచెల్వి పొట్టపై గాయం చేసినందుకు ఒకటి, రక్తమెడుతున్న ఆమెను రక్షించేందుకు యత్నించిన వాచ్మన్ని బెదిరించాడని మరోటి, మొత్తంగా నాలుగు చార్జిషీట్లు ఆయనపై దాఖలయ్యాయి.
తన మాజీ భార్యను బెదిరించడానికి కత్తిని తెచ్చానని, చంపడానికి కాదని కృష్ణన్ చెబుతున్నాడు. పథకం ప్రకారమే నిందితుడు బాధితురాలిపై దాడికి పూనుకున్నాడని కోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







