అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తున్న మహిళ....
- November 06, 2016
అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తున్న మహిళను దిల్లీ విమానాశ్రయంలో అధికారులు అరెస్టు చేశారు. సుమారు రూ.61 లక్షల విలువ చేసే బంగారాన్ని ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నారు. బంగారు కడ్డీలను ఒక మహిళ తన దుస్తుల మధ్యలో ఉంచి తరలిస్తుండటాన్ని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు తనిఖీల్లో భాగంగా గుర్తించారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితురాలు దుబాయి నుంచి వచ్చినట్లు తెలిపారు. 1,400 గ్రాముల బరువున్న 24 క్యారెట్ల 12 బంగారు కడ్డీలు, సహా 110 గ్రాముల బరువున్న బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.61.37 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







