జమ్ముకశ్మీర్‌లో 300 మంది మిలిటెంట్లు:డి.జి.పి

- November 06, 2016 , by Maagulf
జమ్ముకశ్మీర్‌లో 300 మంది మిలిటెంట్లు:డి.జి.పి

జమ్ముకశ్మీర్‌లో ఇప్పటికీ 300 మంది మిలిటెంట్లు చురుగ్గా ఉన్నారని, అశాంతిని రగిల్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర డీజీపీ రాజేంద్ర తెలిపారు. ముఖ్యమంత్రి మెహబుబా ముఫ్తీతో జరిగిన సమావేశంలో 'సరిహద్దుల వెంట మిలిటెంట్లు ఆందోళన కలిగించే పనిలో ఉన్నారని, దాని వల్ల తీవ్ర పరిణామాలను ఎదుర్కొనవలసి ఉంటుందని' డీజీపీ ఆమెకు వివరించారు. నాలుగు నెలల క్రితం హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ కమాండర్‌ బుర్హన్‌వానినీ హతమార్చాక, రాష్ట్రం ఆందోళనలతో అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే.
సీఎంతో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. దాదాపు 250-300 మంది వరకు మిలిటెంట్ల కదలికలు చురుగ్గా ఉన్నాయని, వారి కదలికలు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని డీజీపీ తెలిపారు.

వారు ఇప్పటికే కశ్మీర్‌ లోయలో 70 భవనాలను తగులబెట్టారని, వాటిలో 53 భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. మిలిటెంట్లుకు వ్యతిరేకంగా పోలీసుల చర్యలు జరుగుతున్నాయని డీజీపీ వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com