రజినీకాంత్ ఇప్పుడు ఫుల్ జోష్‌తో వచ్చేశారు...
- November 06, 2016
సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు ఫుల్ జోష్‌తో వచ్చేశారు. హెల్త్ చెకప్‌స కోసం రోబో సీక్వెల్ 2.0 బ్రేక్ వేసి మరీ అమెరికా వెళ్లిన రజినీ.. రీసెంట్ గానే ఇంటికి తిరిగొచ్చేశారు.. ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి దీపావళి పండుగ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. దాదాపు వారం రోజుల పాటు రెస్ట్ తీసుకుని రిలాక్స్ అయిన రజినీ.. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా 2.0 షూటింగ్ కి అటెండ్ అవుతున్నారు. నవంబర్ 5న రోబో సెట్స్ లో జాయిన్ అయిన రజినీకాంత్.. ఈ సారి రెట్టించిన వేగంతో పని చేసేలా ప్లాన్ చేసుకున్నారు. ముందు నిర్ణయించిన షెడ్యూల్‌స కొంత డిస్టర్బ్ కావడంతో.. వాటిని కూడా కవర్ చేసేయనున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌ని ఫినిష్ చేసేందుకు రజినీకాంత్ ఎంతగా ఫిక్‌స అయ్యారంటే..ఈ సారి సినిమాలో తన వంతు భాగం షూటింగ్ మొత్తం పూర్తయ్యే వరకూ బ్రేక్ కూడా తీసుకోరట. 350 కోట్ల రూపా యల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న 2.0 పై అంచనాలు చాలానే ఉన్నాయి. వీటిని అందుకునేందుకు టీమ్ మొత్తం బోలెడంత కష్టపడుతోంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి.. నవంబర్ 20న ఫస్ట్ లుక్ రిలీజ్‌ను ముంబైలో గ్రాండ్‌గా ప్లాన్ చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







