శివ కార్తికేయన్ తన 'రెమో' మూవీని ప్రమోట్ చేస్తూ పవన్ పై ఆ సక్తికర కామెంట్స్ ..
- November 06, 2016
యంగ్ హీరో నితిన్ నుండి సప్తగిరి వరకు ఎందరో టాలీవుడ్ హీరోలు పవన్ కళ్యాణ్ నామ జపం చేస్తూ తమ ఇమేజ్ ని పవన్ అభిమానులలో పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్టులో ఒక కోలీవుడ్ యంగ్ హీరో చేరడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.ఇప్పటికే కోలీవుడ్ లో హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న శివ కార్తికేయన్ త్వరలో తన 'రెమో' మూవీ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే ఈసినిమా ఆడియో ఫంక్షన్ ను అత్యంత ఘనంగా గతవారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసినిమా ప్రమోషన్ కోసం దాదాపు 40 లక్షలు మీడియా వర్గాల పార్టీ కోసమే ఈమధ్య హైదరాబాద్ లో ఖర్చు చేసినట్లు వచ్చిన వార్తలు అందర్నీ ఆశ్చర్య పరిచాయి.ఇది చాలదు అనుకుని కాబోలు శివ కార్తికేయన్ తన 'రెమో' మూవీని ప్రమోట్ చేస్తూ పవన్ పై ఆ సక్తికర కామెంట్స్ చేసాడు. తాను పవన్ కళ్యాణ్ వీరాభిమానిని అని చెపుతూ చెన్నైలో 'గబ్బర్ సింగ్' సినిమాను అభిమానుల మధ్య కూర్చుని ఎంజాయ్ చేసిన విషయాన్ని బయట పెట్టాడు.ఇదే సందర్భంలో ఈ యంగ్ హీరో మాట్లాడుతూ తాను పవన్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ పవన్ కోసం ఎటువంటి బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ పవన్ ఇంట్రడక్షన్ సీన్ లో ఇస్తాడో అన్న ఆ శక్తితో ఎదురు చూస్తున్నానని అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. అయితే 'రెమో' సినిమాకు కూడ అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి అతడి పేరును తెలివిగా పవన్ సినిమా వంకతో గుర్తుకు చేస్తూ తన 'రెమో' ఓపెనింగ్ కలక్షన్స్ కు పవన్ అభిమానుల అండ ఉండేలా చూసుకున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఇప్పటికే ఈ యంగ్ హీరో దిల్ రాజ్ సహకారంతో టాలీవుడ్ లో తన హవాను చాటుకోవడానికి చాల వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తున్న నేపధ్యంలో ఇప్పుడు ఏకంగా ఇతడు పవన్ కళ్యాణ్ ఇమేజ్ పై కన్నేసి మెగా యంగ్ హీరోలు కూడ చేయని భజన పవన్ విషయంలో చేస్తున్నాడు అంటూ సెటైర్లు పడుతున్నాయి..
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







