అస్తమించిన గాంధీ మనవడు
- November 07, 2016
మహాత్మాగాంధీ మనవడు కానూ రాందాస్ గాంధీ(96) తుదిశ్వాస విడిచారు. గాంధీ మనవడిగా కంటే ఆయన సన్నిహితుడిగానే అందరికీ పరిచయమున్న ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు వారాలుగా సూరత్‌లోని రాధాకృష్ణన్ ఆలయం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు.
నాసాశాస్త్రవేత్తగా, అమెరికా రక్షణ శాఖ ఉద్యోగిగా సేవలందించిన ఆయన మెడికల్ రీసెర్చర్ అయిన శివలక్ష్మి(90)ని వివాహం చేసుకున్నారు. ఉప్పు సత్యాగ్రహానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన ఆయనకు భార్య తప్ప నా అన్న వారు ఎవరూ లేరు. 40 ఏళ్లపాటు అమెరికాలో ఉన్న కానూ దంపతులు రెండేళ్ల క్రితం భారత్‌కు తిరిగి వచ్చారు.వీరికి సంతానం లేదు. ఉద్యోగం ద్వారా సంపాదించినది దానధర్మాలకు ఖర్చు చేయడంతో చేతిలో చిల్లిగవ్వలేని దీనస్థితికి చేరుకున్నారు. ఈక్రమంలో అనారోగ్యం పాలైన ఆయన ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్టోబరు 22న వచ్చిన గుండె పోటు కారణంగా కానూ పక్షవాతానికి గురయ్యారు.
ఫలితంగా ఎడమవైపు శరీర భాగం చచ్చుబడిపోయింది. వెంటిలేటర్‌పై ఉన్న ఆయన పరిస్థితి మరింత విషమించడంతో కన్నుమూశారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









