హీరో సునీల్ సినిమాకి క్లాప్ కొట్టిన కె.టి.ఆర్
- November 07, 2016
ఎన్.శంకర్ దర్శకత్వంలో సునీల్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభమైంది. మహాలక్ష్మి ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతుంది. మలయాళ చిత్రం 'టూ కంట్రీస్'కు రీమేక్ ఇది. సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ ఐటీశాఖ మంత్రి కె. తారక రామారావు క్లాప్ కొట్టగా, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వరరెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. డా.దాసరి నారాయణరావు తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ''జై బోలో తెలంగాణ' సినిమాను చేసి తెలంగాణ బిడ్డనని రుజువు చేసుకున్నాడు శంకర్. చలం, మహమూద్ వంటి కమెడియన్స్‌లా నాకు సునీల్ కనపడతాడు.ప్రపంచం గ్లోబలైజేషన్ అయిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య మానవీయ విలువలను, సంబంధాలను కామెడీ మిక్స్ చేసి చూపిస్తున్నారు'' అని పేర్కొన్నారు.
ఎన్. శంకర్ మాట్లాడుతూ ''సునీల్ బాడీ లాంగ్వేజ్ మలయాళ హీరో దిలీప్‌లా ఉంటుంది. గతంలో దిలీప్ చేసిన సినిమాను సునీల్ 'పూలరంగడు' పేరుతో రీమేక్ చేసి విజయం సాధించారు. ఇప్పుడు దిలీప్ హీరోగా చేసిన 'టు కంట్రీస్' చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాం. శ్రీధర్ సీపాన హ్యుమన్ ఎమోషన్స్‌తో కూడిన డైలాగ్స్‌ను అందించారు. డిసెంబర్ మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. ఎనబై శాతం సినిమా అమెరికాలో చేస్తాం' అని తెలిపారు. ఎలాంటి వల్గారిటీ లేకుండా డీసెంట్ కామెడీతో ఫ్యామిలీ ఆడియెన్స్ కలసి చూసేలా సినిమా ఉంటుందని శ్రీధర్ సీపాన అన్నారు.
తాజా వార్తలు
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!







