తిరుపతిలో హెలిపాడ్ ఏర్పాటు....
- November 07, 2016
తిరుపతి ప్రధాన కేంద్రంగా రాష్ట్రంలో హెలీ టూరిజానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. తిరుపతిలో యుద్ధప్రాతిపదికన హెలిపాడ్ ఏర్పాటు చేయాలంటూ కలెక్టర్‌ను ఆదేశించింది. అదే రీతిలో హెలీ టూరిస్టులకు తిరుపతి, తిరుమలల్లో వసతి, శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేయాల్సిందిగా టీటీడీ ఈవోకూ ఆదేశాలు జారీ అయ్యాయి. హెలికాప్టర్ సర్వీసులు, హెలిపాడ్ల నిర్వహణా బాధ్యతలను సుమిత్ ఏవియేషన్ సంస్థకు అప్పగించింది. ఈ నిర్ణయాలకు సంబంధించిన కీలక ఉత్తర్వులు సోమవారం జారీ అయ్యాయి.
రాష్ట్రంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలను కలుపుతూ ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచే విషయమై ప్రభుత్వం ఎప్పటినుంచో పలు నిర్ణయాలు తీసుకుంటూ వాటిని అమలు చేస్తూ వస్తోంది.
అయితే తాజాగా ఈ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. దీర్ఘకాలంగా ప్రవాస భారతీయులు, ప్రత్యేకించి ప్రవాసాంధ్రులు రాష్ట్రంలోని ముఖ్య ఆలయాలైన విజయవాడ కనకదుర్గ ఆలయం, శ్రీశైలం, తిరుపతికి రెగ్యులర్‌గా విమానయాన సర్వీసులు అందుబాటులో వుంచాలని ప్ర భుత్వాన్ని పదేపదే కోరుతూ వస్తున్నారు. దానికి తోడు ఇటీవల ఢిల్లీలో టూరిజం ట్రేడ్ ఫెయిర్ జ రిగిన సందర్భంగా ఢిల్లీకే చెందిన సుమిత్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి హెలీ టూరిజం గురించి ప్రతిపాదన చేశారు. తమకు తగిన విధంగా సహాయ సహకారాలందిస్తే రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల సందర్శనకు హెలికాప్టర్ సర్వీసులు రెగ్యులర్‌గా నడుపుతామంటూ సంసిద్ధత వ్యక్తం చేశారు.
ముఖ్యంగా తిరుపతి, తిరుమలల్లో వసతి, రవాణా, శ్రీవారి దర్శనం, ప్రసాదం వంటివి హెలి టూరిస్టులకు అందించేందుకు టీటీడీని ఒప్పించాలని కోరా రు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం వేగంగా స్పం దించింది. రాష్ట్రంలో విజయవాడ నుంచీ శ్రీశైలం, తిరుపతిలకు హెలికాప్టర్ సర్వీసులు నడిపే బా ధ్యతను సుమిత్ ఏవియేషన్ సంస్థకు అప్పగించిం ది. తిరుపతిలో హెలిపాడ్ ఏర్పాటుకు అవసరమైన భూమిని సమీకరించడంతో పాటు అందులో హెలిపాడ్ ఏర్పాటు చేసే బాధ్యతను కలెక్టర్‌కు అ ప్పగించింది.
ఈ పనులను యుద్ధప్రాతిపదికన చే యాలని ఆదేశించింది. హెలిపాడ్ ఏర్పాటయ్యాక దాని నిర్వహణ మాత్రం సుమిత్ సంస్థ యాజ మాన్యమే చేపట్టాలని నిర్దేశించింది. ప్రారంభ దశ లో హెలిపాడ్ వినియోగించుకోవడానికి గానూ సుమిత్ సంస్థ నెలకు వెయ్యి రూపాయల నామమాత్రపు లీజు చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా హెలి టూరిస్టులకు తిరుపతి, తిరుమలల్లో వసతి, రవాణా, శ్రీవారి దర్శనం, ప్రసాదం వంటివి కల్పించాలని టీటీడీ ఈవోకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ చర్య వల్ల కేవలం తిరుమలకే కాకుండా హెలి టూరిస్టులు తిరుపతి పరిసరాల్లోని శ్రీనివాసమంగాపురం, తిరుచానూరు, శ్రీకాళహస్తి, నారాయణవనంలోని కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం, ఏర్పేడు మండలంలోని గుడిమల్లం పరశురామేశ్వరాలయాలకు కూడా ఎన్ఆర్ఐలు, ప్రవాసాంధ్రుల తాకిడి పెరిగే అవకాశముంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మొత్తం మీద హెలి టూరిజం వల్ల తిరుమల, తిరుపతిలతో పాటు జిల్లాలోని పలు పుణ్యక్షేత్రాలకు మరింత ప్రాధాన్యత పెరగనుంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









