భారత్ లో భారీ విధ్వంసం సృష్టిస్తాం : హఫీజ్
- November 08, 2016
భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో జరిపిన సర్జికల్ దాడులకు ప్రతీకారం తీర్చుకొనే వ్యూహ రచన చేస్తోంది... భారత సైనిక శిబిరం పై సర్జికల్ దాడులు చేపడుతూ.. అదే సమయంలో ప్రధాన నగరాల్లో విధ్వంసానికి రెడీ అవుతోందని లష్కరే తోయబా నేత హఫీజ్ చేసిన వ్యాఖ్యలను బట్టి అర్ధం అవుతుంది. వివరాల్లోకి వెళ్తే...లష్కరే తోయబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ జమ్మూకాశ్మీర్ లోని సరిహద్దుల్లో ఉన్న సైన్యంపై త్వరలో సర్జికల్ దాడులు నిర్వహిస్తామని స్వయంగా ప్రకటించాడు. భారత్ జరిపిన మెరుపు దాడులకు ప్రతీకారంగా భారత్ ఎన్నడూ మరచిపోలేనంత దారుణంగా దాడులు చేస్తామని ప్రకటించాడు. భారత్ పై మెరుపు దాడులు చేసేలా ముజాహిదీన్(కశ్మీరీ ఉగ్రవాదులు) ప్రణాళిక రూపొందిస్తున్నట్లు జమాత్-ఉద్-దావా అధిపతి, ముంబయి ఉగ్రదాడుల సూత్రధారైన హఫీజ్ వెల్లడించాడు.. ఇప్పటికే ప్రధాన పట్టణాల్లో ఉగ్రదాడులకు లష్కరే తాయిబా వ్యూహరచన చేస్తోంది. భారత-పాక్ సరిహద్దుల వెంబడి ప్రవహిస్తున్న నిక్కీ తావి, బడి తావి నదులద్వారా దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు సిద్ధమవుతున్నారు. భారతలో భారీ ఎత్తున దాడులకు పాల్పడి విధ్వంసం సృష్టించే బాధ్యతను లష్కరే కమాండర్ అబు ఇర్ఫాన్ తండేవాలాకు సయీద్ అప్పగించినట్లు తెలుస్తోంది. ఈమేరకు భారత నిఘా సంస్థలు పక్కా సమాచారం సేకరించాయి.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







