పాకిస్తాన్ 20-20 క్రికెట్ లీగ్ కి అతిధ్యమివ్వనున్న ఖతార్
- August 27, 2015
ఒక చారిత్రాత్మక ప్రారంభానికి చిహ్నంగా, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి లో జరగనున్నమిలియన్ డాలర్ల పాకిస్తాన్ సూపర్ 20-20 లీగ్ మేచ్ కు అతిధ్యమివ్వడం ద్వారా కతార్ క్రికెట్ కోసం పడిగాపులు పడుతూ ఉన్న అభిమానుల దాహాన్ని తీర్చనుంది. ప్రపంచంలోనే మేటి ఆటగాళ్లను, వారి ఆటను కళ్ళారా చూడడానికి అభిమానులు కేరింతలు కొడుతున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నజమ్ సేథి ఈ మేచ్లు 2016 ఫిబ్రవరి 4 నుండి 24 మధ్య జరగనున్నట్టు ప్రకటించారు. ప్రపంచస్థాయి క్రికెట్ కు అతిధ్యమిచ్చే గల్ఫ్ దేశాల్లో షార్జా మొదటిది కాగా, అనంతరం దుబాయి, అబుధాబీ కూడా ఈ వరుసలో చేరాయి; ఇపుడు దోహా కూడా వాటి సరసన సగర్వంగా నిలచి క్రికెట్ లోకంలో తారగా తళుకులీననుంది!
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







