తీవ్రరూపం దాల్చనున్న నీటికొరత - మొదటి పది స్థానాల్లో ఉన్న యు.ఏ.ఈ.

- August 27, 2015 , by Maagulf
తీవ్రరూపం దాల్చనున్న నీటికొరత - మొదటి పది స్థానాల్లో ఉన్న యు.ఏ.ఈ.

2040 నాటికీ, 33 మధ్య ప్రాచ్య దేశాల్లో సగానికి పైగా తీవ్ర నీటి  కరువునెదుర్కోనున్నట్టు, వాటిలో మొదటి పది దేశాల్లో  యు.ఏ.ఈ.  ఉందని,  167 దేశాలను సర్వే చేసిన నిపుణులు తెలియజేశారు.  13 మధ్య ప్రాచ్య దేశాలు మరియు పాలస్తీనా రాజ్యాలు రానున్న 25 సంవత్సరాలలో నీతి ఎద్దడిని చవిచూస్తాయని, వాటిలో బహ్రైన్, కువైట్, పాలస్తీనా రాజ్యాలు, కతార్, యూ. ఏ. ఈ., ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఒమాన్ వంటివి మొదటి 10 స్థా నాలాక్రమిస్తున్నాయి. సగటున ఒక యు. ఏ. ఈ. నివాసి రోజుకు 550 లీటర్ల  నీటిని వాడతా డు. ఇది ప్రపంచ సగటు కంటే 3 రెట్లు అధికం; ఇక, లవణాలు  తీసివేయబడిన సముద్రజలం, భూగర్భాజలం, ఇంకా శుద్ధి చేయబడిన వాడుక నీరు వంటివి యు. ఏ. ఈ.  నీటి వనరులు. అయినప్పటికీ, 2030 నాటికీ భూగర్భజలం తగ్గిపోనున్న నేపధ్యంలో నీటి వాడకాన్ని తగ్గించేలా చర్యలను తీసుకోవడం మంచిదని ప్రపంచ వనరుల సంస్థ డైరక్టర్ బెట్సీ ఒట్టో తెలిపారు. ఐతే నీటి కొరత వల్ల వల్ల సిరియా వంటి దేశాల్లో తలెత్తిన తిరుగుబాటు, ఇక్కడ కూడా సంభవించే ప్రమాదంపై ఇప్పుడు వేడివేడి రాజకీయ చర్చలు సాగుతున్నాయి.


--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com