'శాతకర్ణి' కొత్త లుక్

- November 08, 2016 , by Maagulf
'శాతకర్ణి' కొత్త లుక్

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రియ నటిస్తోంది. తాజాగా బాలయ్య లుక్ మరొకటి బయటికి వచ్చింది. రాజు వేషధారణలో బాలకృష్ణ పూర్తి రూపాన్ని ఈ పోస్టర్ ఆవిష్కరిస్తోంది. శాతకర్ణి ఇలానే వుండేవాడేమోనని అనిపించేలా ఆయన ఆ పాత్రకి కుదిరారు. తన కోసం వచ్చిన వారిని కలుసుకోవడం కోసం, ఎలాంటి ఆయుధాలు ధరించకుండా గుడారం నుంచి చిరునవ్వుతో వస్తోన్న శాతకర్ణిగా బాలకృష్ణ కనువిందు చేస్తున్నాడు.సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com