బ్యాంకులు, పోస్టాఫీసుల్లోరూ.500 నోట్లు, రూ.1000 మార్చుకోవడానికి గుర్తింపు పత్రాలు తప్పనిసరి..
- November 08, 2016
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం తమ వద్ద ఉన్న రూ.500, రూ.1000 నోట్లను ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు.నల్లధనాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా, రూ.500 నోట్లు, రూ.1000 నోట్లు మంగళవారం అర్థరాత్రి నుంచి చలామణిలో ఉండవని మోడీ ప్రకటించిన విషయం తెల్సిందే.ఈ నేపథ్యంలో బ్యాంకులు, పోస్టాఫీసుల్లో వీటిని మార్చుకోవడానికి గుర్తింపు పత్రాలు తప్పనిసరి చేశారు.పాన్ కార్డు, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడిలలో ఏదో ఒకటి తప్పనిసరిగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో చూపించి మాత్రమే ఈ నోట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ గుర్తింపు కార్డులు లేకుండా పాత నోట్లను మార్చుకోవడం కుదరదు. అందువల్ల నల్లధనం దాచుకున్న వ్యక్తులు కట్టల కొద్దీ రూ.500 నోట్లు, రూ.1000 నోట్లను మార్చుకోవడం అంత తేలికకాదు.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







