రానున్న 'రఘువరన్‌ బీటెక్‌' సీక్వెల్‌

- November 09, 2016 , by Maagulf
రానున్న 'రఘువరన్‌ బీటెక్‌' సీక్వెల్‌

ధనుష్‌ కథానాయకుడిగా 2014లో విడుదలై ఘన విజయం సాధించిన 'రఘువరన్‌ బీటెక్‌' చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కనుంది. తెలుగులో ఈ చిత్రాన్ని 'వీఐపీ 2' అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నట్లు ధనుష్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ప్రకటించారు. డిసెంబరులో చిత్రం షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు తెలుపుతూ. పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్రానికి కథ-డైలాగ్స్‌ ధనుష్‌, దర్శకత్వం-స్క్రీన్‌ప్లే సౌందర్య రజనీకాంత్‌. కథానాయిక, మిగిలిన చిత్ర బృందం సమాచారం తెలియాల్సి ఉంది. 'రఘువరన్‌ బీటెక్‌' చిత్రానికి వేల్‌రాజ్‌ దర్శకత్వం వహించారు. నిరుద్యోగిగా ఉన్న గ్రాడ్యుయేట్‌ విద్యార్థి ఎలా సక్సెస్‌ఫుల్‌ సివిల్‌ ఇంజనీర్‌ అయ్యారనే కథతో నిర్మించిన ఈ చిత్రంలో అమలాపాల్‌ కథానాయికగా నటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com