ఖతార్ లో నేడు ఇసుక తుఫాను-పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
- August 27, 2015
నేడు కతార్ లో 19 నుండి 38 కిలోమీటర్ల వేగంతో ఇసుక తుఫాను రానున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ వేగం 46 కి. మీ. కూడా ఉండవచ్చు. ఈ శాఖ అధికారి అల్ షార్క్, తీర ప్రాంతాలు, సముద్ర ప్రాంతాలు ముఖ్యంగా దీని బారిన పదే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు. ఇందుకు తగినట్టు దోహాలో నేడు పగటి ఉష్ణోగ్రత 45 డిగ్రీలుగా, అల్ వాక్రా, అల్ ఖోర్, దుఖాన్ మరియు మేస్సీద్ లలో 43 డిగ్రీలుగా ఉండచ్చని అంచనా! ఐతే రాత్రి వేళ ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, సముద్ర ఉత్తర దిశలో పెద్ద గాలులు వీచి, పెద్ద కెరటాలు వస్తాయని మత్స్యకారులకు సూచనగా తెలిపారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







