ఖతార్ లో నేడు ఇసుక తుఫాను-పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

- August 27, 2015 , by Maagulf
ఖతార్  లో నేడు ఇసుక తుఫాను-పెరుగుతున్న  ఉష్ణోగ్రతలు

నేడు కతార్ లో 19 నుండి 38 కిలోమీటర్ల వేగంతో ఇసుక తుఫాను రానున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ వేగం 46 కి. మీ. కూడా ఉండవచ్చు.  ఈ శాఖ అధికారి అల్ షార్క్, తీర ప్రాంతాలు, సముద్ర ప్రాంతాలు ముఖ్యంగా దీని బారిన పదే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు. ఇందుకు తగినట్టు దోహాలో నేడు పగటి ఉష్ణోగ్రత 45 డిగ్రీలుగా, అల్ వాక్రా, అల్ ఖోర్, దుఖాన్ మరియు మేస్సీద్ లలో 43 డిగ్రీలుగా ఉండచ్చని అంచనా! ఐతే రాత్రి వేళ ఉష్ణోగ్రతలు తగ్గుతాయని,  సముద్ర ఉత్తర దిశలో పెద్ద గాలులు వీచి, పెద్ద కెరటాలు వస్తాయని మత్స్యకారులకు సూచనగా తెలిపారు.


--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com