ఫెరారీ వరల్డ్‌లో ఉచిత ప్రవేశం
- November 09, 2016
నేషనల్ డే శెలవుల్లో ఫెరారీ వరల్డ్‌లో ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నారు. అబుదాబీ ఫెరారీ వరల్డ్ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. నవంబర్ 10 నుంచి డిసెంబర్ వరకు ఈ ఉచిత ప్రవేశం వర్తిస్తుంది. ఒక్క దిర్హామ్ కూడా చెల్లించకుండానే ఫెరారీ అనుభూతిని పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు. పవిత్ర రమదాన్ మాసంలో ఈ ఆఫర్‌ని ఓ సారి కల్పించామనీ, ఇప్పుడు ఇంకోసారి అదే ఆఫర్ ఇస్తున్నామని ఫెరారీ వరల్డ్ అబుదాబీ జనరల్ మేనేజర్ జనెస్సీ వర్గాస్ తెలిపారు. ఇంకో వైపున సీజన్ పాస్‌తో అన్‌లిమిటెడ్ యాక్సెస్‌ని ఫెరారీ వరల్డ్‌లో పొందే అవకాశం కూడా కల్పించారు. ఉచితంగా 6 గంటల తర్వాత పార్క్‌లోకి ప్రవేశించవచ్చనీ, ఆ తర్వాత పలు రైడ్స్ కోసం నిర్దేశిత ఉసుములు చెల్లించాల్సి ఉంటుంది. 215 దిర్హామ్‌లకు కాంబో మీల్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చారు. పలు రకాల ప్యాకేజీలను ఎంచుకుని ఆయా రైడ్స్‌ని ఆస్వాదించవచ్చు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









