ట్రంప్ మధ్య ప్రాచ్యంలో స్థిరత్వం కోసం కృషి చేస్తారని సౌదీ రాజు ఆశాభావం
- November 10, 2016
రియాద్ : అమెరికా తదుపరి అధ్యక్షులుగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్‌కు సౌదీ రాజు సల్మాన్ బుధవారం ఒక సందేశం ద్వారా అభినందనలు తెలిపారు. నూతన అధ్యక్షుడు మధ్య ప్రాచ్యంలో స్థిరత్వం సాధించడానికి కృషి చేస్తారని సౌదీ రాజు ఆశాభావం వ్యక్తం చేస్తూ అధికారిక సౌదీ ప్రెస్ ఏజెన్సీ ద్వారా నివేదించారు. ఇరు దేశాల సంబంధాలు మరింతగా అత్యున్నత స్థాయికి వెళ్లేందుకు ట్రంప్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సౌదీ రాజు సల్మాన్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉండే సంబంధాలను ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. చారిత్రక మరియు పటిష్టమైన స్నేహపూర్వక విధానాలు రెండు దేశాల మధ్య అభివృద్ధి మరియు గట్టిగా బలోపేతం కావాలని ఆయన కోరుకున్నారు. యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా కు మరియు సౌదీ అరేబియా దేశాల మధ్య సౌదీ చమురు, అమెరికన్ భద్రతా మార్పిడి ఆధారంగా ఒక దశాబ్దాల కాలంగా బలమైన సంబంధం కలిగి ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో గత ఎనిమిది సంవత్సరాల డెమోక్రటిక్ పరిపాలన సమయంలో రియాద్ వాషింగ్టన్ మధ్య సంబంధాలు భయపెట్టిన తీరులో మారిందని సౌదీ రాజు గుర్తు చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..







