అమితాబ్‌ బచ్చన్‌ 'సర్కార్‌ 3' కోసం గణేశ్‌ హారతి పాట పాడారట

- November 10, 2016 , by Maagulf
అమితాబ్‌ బచ్చన్‌ 'సర్కార్‌ 3' కోసం గణేశ్‌ హారతి పాట పాడారట

బాలీవుడ్‌ షహెన్‌షా అమితాబ్‌ బచ్చన్‌ తన తర్వాతి చిత్రం 'సర్కార్‌ 3' కోసం గణేశ్‌ హారతి పాట పాడారట. 'సర్కార్‌ 2'కి కొనసాగింపుగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ సమయంలో తీసిన ఫొటోను అమితాబ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 'సర్కార్‌ 3 కోసం ప్రార్థిస్తున్నాను, గణేశుడికి హారతి ఇస్తున్నా.. ఈ పాటను నేనే పాడా' అని అమితాబ్‌ ట్వీట్‌ చేశారు.
జుహూ బీచ్‌లో చిత్రీకరించిన ఈ పాట కోసం సీరియస్‌ లుక్స్‌తో ఉన్నట్లు బిగ్‌బి చెప్పారు. ఈ చిత్రంలో యామీ గౌతమ్‌, జాకీ ష్రాఫ్‌, మనోజ్‌ బాజ్‌ పాయ్‌, రోనిత్‌ రాయ్‌, భరత్‌ దభోల్కర్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com