భారతీయ దంపతుల ఆత్మహత్యాయత్నం... భర్త మృతి, చికిత్స పొందుతున్న భార్య
- November 10, 2016
దుబాయ్: ఒక భారతీయ దంపతులు తమ జీవితాలను అంతం చేసుకోవడానికి ప్రయత్నించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆత్మహత్యాయత్నానికి ముందు వారి కుమారులను వేరే ప్రాంతానికి పంపిన తర్వాత ఈ దారుణానికి ఒడిగట్టారు. భారతదేశానికి చెందిన ఒక వ్యాపారవేత్త చనిపోయినట్లు దుబాయ్ లో బుధవారం మధ్యాహ్నం వారి అపార్ట్మెంట్ వద్ద కనుగొన్నారు. ఈ భార్యభర్తలు అనుమానిత ఆత్మాహుతి ఒడంబడిక తర్వాత భర్త చనిపోగా, భార్య చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు.అడ్వర్టైజింగ్ సంస్థ యజమాని వి. కుమార్ కాగా ,ఆయన సతీమణి సైతం వెండి ఆభరణాలు అమ్మే దుకాణం నిర్వహించేది. వీరు ఇరువురు ఆత్మహత్య చేసుకోవాలని ముందుగానే ఒక ప్రణాళిక రచించి అందులో భాగంగా తన భార్య, వారి ఇద్దరు యువ కుమారులను బంధువుల ఇంటికి పంపినట్లు వారి ఇంటి పొరుగువారు " మా గల్ఫ్ డాట్ కామ్ " కు తెలిపారు. అదేవిధంగా ఈ దంపతులు కొన్ని రోజుల క్రితమే వారి ఇంట్లో పని చేసే వ్యక్తిని సైతం వేరే చోటుకి పంపారని , అదేవిధంగా వారి పిల్లలలను కొన్ని రోజులుగా పాఠశాలకు పంపించడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఆర్థిక సమస్యలు తీవ్రమవడంతో వారు ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రేరేపించాయిమోనని కొందరు అనుమానిస్తున్నారు.
అస్పష్టంగా పద్ధతి -
ఆంధ్ర ప్రదేశ్ నుండి ఇక్కడకు వచ్చి అనూహ్యంగా ప్రాణాలు పోగొట్టుకొన్నఈ జంట, కరమ లో ఉమ్మె హురైర భవనంలో నాలుగో అంతస్తుల అపార్ట్మెంట్ లో వారి జీవితాలను అంతం చేసుకొనేందుకు ప్రయత్నించారు. వీరు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారో ఇంతవరకు ఎటువంటి స్పష్టమైన సమాచారం తెలియడం లేదు. "నేను స్కూల్ బస్సు నుండి నా కుమారుడిని తీసుకొని పై అంతుస్తులోనికి అడుగు పెట్టినపుడు నేను ఆశ్చర్యకరమైనవి వార్తలు విన్నప్పుడు దిగ్బ్రాంతికి గురయ్యాను " ఒక భారతీయ మహిళ తమతో పాటు భవనంలో నివసిస్తున్నట్లు చెప్పారు. " పొరుగున ఈ విషాద సంఘటన జరగడం నిజంగా ఒక షాక్ కల్గించే వార్త అని దీనిపై ఎంతో విచారంగా ఉన్నామని అన్నారు. వారి కుమారులు మా పిల్లలతో ఆడటానికి వస్తారని ఆమె బాధపడ్డారు. కుమార్ భార్య సజీవంగా దొరకడంతో పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. వీరు ఆత్మహత్య చేసుకొన్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి రాకపోవడంతో వారి పరిస్థితి ప్రమాదకరంగా మారిందని స్థానికులు వ్యాఖ్యలు చేస్తున్నారు. కుమార్ లో సంస్థ లో తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్నఒకానొక ఉద్యోగి ఈ విధంగా తెలిపారు "కుమార్ గారు మంగళవారం విధులకు హాజరు కాలేదని, అయితే ఉద్యోగులకు ఏ భారీ ఆర్థిక సమస్యలు లేవని వారి జీతాలు కొన్ని నెలల క్రితం కొద్దిగా ఆలస్యంగా వచ్చేవారని చెప్పారు. కుమార్ దంపతుల కుమారులు కేవలం10 ఏళ్ళ వయస్సు, ఆరు సంవత్సరాల వయస్సులని వారిని 'ఇంటర్నేషనల్ సిటీ' లోని బంధువుల ఇంటికి పంపారని తెలిపారు. వారు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమై ఉంటుందో తెలియదు. నేను నిజంగా కలతచెందుతున్నామని అన్నారు."
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







