వ్యాపారం, మోసం
- August 28, 2015
ఒకరోజు అక్బర్, బీర్బల్ సాయంత్రం అలా చల్లగాలికి ఉద్యానవనంలో తిరుగుతూ మాట్లాడుకుంటున్నారు. మధ్యలో రాజుకు ఒక డౌట్ వచ్చింది. ఈ ప్రపంచంలో ఎక్కువ మోసగాళ్లు ఎవరుంటారు బీర్బల్ అని అడిగాడు అక్బర్. వ్యాపారస్తులు ప్రభూ! అని ఠక్కున సమాధానమిచ్చాడు బీర్బల్. వ్యాపారస్తులందరూ మోసగాళ్లంటే నేను నమ్మను. కొందరు మంచి వాళ్లుంటారు. కొందరు చెడ్డవాళ్లుంటారు అన్నాడు అక్బర్. లేదు ప్రభూ వ్యాపారంలో డబ్బు సాధించాలంటే వ్యాపారస్తులు ఏదో ఒక రకంగా చిన్నదో పెద్దదో మోసం చేసి తీరాల్సిందే అన్నాడు. అయితే నువ్వ నిరూపించగలవా అని పరీక్ష పెట్టాడు అక్బర్, బీర్బల్‌కి. అప్పుడు బీర్బల్ ఒక ఉపాయం ఆలోచించి రాజ్యంలోని వ్యాపారస్తులందరినీ పిలిపించి, అందరూ ఒక్కొక్క చెంబుడు పాలు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. అందుకు వ్యాపారస్తులందరూ మరసటిరోజు ఉదయాన్నే ఒక మూత ఉన్న చెంబుల్లో పాలు తీసుకుని వచ్చారు. బీర్బల్ ఒక గదిలో ఒక పెద్ద మూత ఉన్న గంగాళాన్ని సిద్దం చేశాడు. వ్యాపారస్తుఃలందరూ తాము తీసుకొచ్చిన పాలను ఒక్కొక్కరిగా ఆ గంగాళంలో చెంబులు ఒంపి వెళ్లారు. బీర్బల్, అక్బర్‌తో సహా వచ్చి ఆ గంగాళంలోకి తొంగిచూడగా అందులో ఒక్క చుక్క కూడా పాలు లేవు. మొత్తం నీళ్లే ఉన్నాయి. చూశారా ప్రభూ వ్యాపారస్తులు ఎవరికి వారే మిగతావారు పాలు పోస్తారు కదా. నేను పోసే ఒక్క చెంబు నీళ్లు ఏం తేడాతెలుస్తుంది అనుకుని అందరూ నీళ్లే తీసుకువచ్చారు అన్నాడు. అప్పుడు బీర్బల్ ఉపాయానికి, మెచ్చుకుని అతని సలహాలు అక్షరాలా నిజమయినవి అని అక్భర్, బీర్బల్‌ను అభినందించాడు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









