సునీల్,మన్నార చోప్రాల చిత్రం విషయాలు

- August 28, 2015 , by Maagulf
సునీల్,మన్నార చోప్రాల చిత్రం విషయాలు

విశాఖలో వినోదాలు సునీల్‌ కథానాయకుడిగా ఆర్‌పీఏ క్రియేషన్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. మన్నారా చోప్రా కథానాయిక. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్‌.సుదర్శన్‌ రెడ్డి నిర్మాత. ఇటీవల హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో నాయకానాయికలు, ఇతర ప్రధాన తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. వచ్చేనెల రెండో వారంలో విశాఖపట్నంలో నెలరోజుల పాటు చిత్రీకరణ జరపనున్నారు. నిర్మాత మాట్లాడుతూ ఆద్యంతం ఉత్కంఠగా సాగే చిత్రమిది. కథ, కథనాల్లో మలుపులు ఆసక్తిని రేకెత్తిస్తాయి. సునీల్‌ శైలి వినోదం కూడా ఉంటుంది. 'ప్రేమకథా చిత్రమ్‌' తరవాత మా సంస్థ నుంచి వస్తున్న సినిమా ఇది. సప్తగిరి పంచే వినోదం ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోందన్నారు. కబీర్‌ సింగ్‌, గొల్లపూడి మారుతీరావు, నాగినీడు, సత్యప్రకాష్‌, ప్రదీప్‌ రావత్‌, రాజా రవింద్ర, అదుర్స్‌ రఘు, ఉదయ్‌, ప్రభాస్‌ శీను తదితరులు నటిస్తున్నారు. సంగీతం: దినేష్‌, సహ నిర్మాతలు: ఆర్‌.ఆయుష్‌రెడ్డి, ఆర్‌.పి.అక్షిత్‌ రెడ్డి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com