బరాక్ ఒబామా తో డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో భేటీ...
- November 10, 2016
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తో కొత్తగా ఎన్నికైన ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భేటీయ్యారు. గురువారం సాయంత్రం వైట్ హౌస్ లో వీరిద్దరు సమావేశమయ్యారు.
అధ్యక్ష ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన ట్రంప్ తో సమావేశమయ్యేందుకు రావాలని ఒబామా ఆహ్వనించారు. ఒబామా ఆహ్వానంతో ట్రంప్ వైట్ హౌస్ చేరుకుని ప్రత్యేకంగా భేటీయ్యారు. ఎన్నికల సమయంలో ఇరువురు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ఒబామా ట్రంప్ ను ఉద్దేశించి అత్యంత ప్రమాదకారి అని అనగా... అంతే స్థాయిలో ట్రంప్ బదులిచ్చారు. అమెరికా అధ్యక్షుల్లో అత్యంత వరస్ట్ ప్రెసిడెంట్ బబామా అని ట్రంప్ అన్నారు. అగ్రరాజ్యంలో వీరివురి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
అధికారం బదలాయింపుపై వీరిద్దరి మధ్య చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో ట్రంప్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







