మాస్ అవతారంలో కనిపించనున్న ఎన్టీఆర్
- November 11, 2016
ఎన్టీఆర్ కథానాయకుడిగా ఈ మధ్య కాలంలో చేసిన 'నాన్నకు ప్రేమతో' .. 'జనతా గ్యారేజ్' సినిమాలు, అప్పటివరకూ ఆయన చేస్తూ వచ్చిన సినిమాలకు పూర్తి భిన్నమైనవి. ఈ రెండు సినిమాల్లోను ఆయన కొత్తగా కనిపిస్తూ అభిమానులను అలరించాడు. ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి .. చందు మొండేటి ఎన్టీఆర్ ను కలిసి కథలను వినిపించారట. ఈ కథలు విన్న ఎన్టీఆర్ వేరే కథలతో రమ్మన్నాడట. కారణం ఏమిటంటే...అనిల్ రవిపూడి, చందు మొండేటి ప్రయోగాత్మక కథలు చెప్పారట. ప్రస్తుతం అన్ని వర్గాల ప్రేక్షకులును ఆకట్టుకునే మాస్ మసాలా మూవీ చేయాలి అనుకుంటున్నాను. అందుచేత ప్రయోగాలు వద్దు..మాస్ మసాల కథలే ముద్దు అన్నట్టు ఎన్టీఆర్ తన నిర్ణయాన్ని చెప్పేసాడట. అనిల్ రవిపూడి, చందు మొండేటి ఎన్టీఆర్ కోరుకున్నట్టుగా మాస్ మసాలా స్టోరీస్ రెడీ చేసి వినిపిస్తారో లేదో..? ఫైనల్ గా ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఏ డైరెక్టర్ కి వస్తుందో చూడాలి..!
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







