జపాన్ తో భారత్ అణు ఒప్పందం.!
- November 11, 2016
ప్రధాని నరేంద్రమోదీ జపాన్ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా భారత్, జపాన్ మధ్య అణు ఒప్పందం కుదిరింది. అనంతరం మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఎన్ఎస్జీలో భారత సభ్యత్వానికి మద్దతు తెలిపిన జపాన్‌కు మోదీ ధన్యవాదాలు తెలిపారు. జపాన్‌తో పౌర అణు ఒప్పందం చరిత్రాత్మకమైనదని అభివర్ణించారు. జపాన్‌తో పౌర అణు ఒప్పందం కుదుర్చుకున్న తొలి దేశం భారత్ అని తెలిపారు. ఇరు దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసి పోరాడుతాయని స్పష్టం చేశారు. వ్యూహాత్మక భాగస్వామ్యం వల్ల ఇరుదేశాల్లో శాంతి, సమన్వయం, స్థిరత్వం నెలకొంటాయన్నారు. భారత్, జపాన్ సహజ భాగస్వామ్య దేశాలని మోదీ పేర్కొన్నారు. పెట్టుబడులు, తయారీ రంగాలకు భారత్ ప్రధాన కేంద్రం కావాలన్నదే తమలక్ష్యమని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







