మార్చిలో ప్రారంభంకానున్న కార్తీ, మణిరత్నం సినిమా
- November 11, 2016
కార్తీ, అదితిరావు హైదరి జంటగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న రొమాంటిక్ డ్రామా 'కాట్రు వెలియిడై'. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు కార్తీ ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. మద్రాస్ టాకీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్. రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. రవివర్మ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా శ్రీకర్ ప్రసాద్ సినిమా ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. రుక్మిణీ విజయకుమార్, శ్రద్ధా శ్రీనాథ్, ఆర్జే బాలాజీ, దిల్లీ గణేశ్, విపిన్ శర్మ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఈ పోస్టర్లో కార్తీ, అదితి హైదరీతో పాటు రెండు జెట్ విమానాలు కూడా ఉన్నాయి. మణిరత్నం చిత్రాలు వాస్తవికతకు దగ్గరగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్ర కథ గురించి ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. కానీ పోస్టర్‌ను చూస్తుంటే విభిన్న కథాంశంతోనే మణిరత్నం చిత్రాన్ని తెరకెక్కిస్తున్న కోలీవుడ్ సమాచారం.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







