చెన్నైలో సినీనటి సబర్న ఆత్మహత్య??
- November 11, 2016
సినీనటి, టీవీ వ్యాఖ్యాత సబర్న చెన్నై మధురవాయిలోని ఆమె నివాసంలో మృతిచెందింది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకొని ఉంటుందని భావిస్తున్నారు. గత మూడు రోజులుగా ఆమె ఇంటి తలుపులు మూసివున్నాయి. శుక్రవారం ఆ ప్లాట్ నుంచి దుర్వాసర రావడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తాళం లేకుండా దగ్గరకు మూసిఉన్న తలుపు తీసి లోపలికి ప్రవేశించారు. అనంతరం తలుపు వద్ద ఉన్న సబర్న మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం వద్దపోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆత్మహత్యగానే పరిగణిస్తున్నప్పటికీ.. ఇతర కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. టెలివిజన్ యాంకర్‌గా జీవితం ప్రారంభించిన సబర్నా పలు సినిమాలు, సీరియళ్లలోనూ నటించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







