ఊపిరి తిత్తుల వ్యాధులకు ప్రొద్దు తిరుగుడు గింజలే దివ్య ఔషధం..!
- November 11, 2016
ఊపిరి తిత్తుల వ్యాధులతో బాధపడేవారికి ప్రొద్దు తిరుగుడు గింజలతో చేసిన కషాయము అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. అయితే ప్రొద్దు తిరుగుడు చేదు, వగరు, కారం రుచులతో వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. శరీరంలోని కఫరోగాలను పిత్త రోగాలను, శ్వాసరోగాలను, జ్వరాలను, చర్మరోగాలను, ప్రమేహాలను రక్తదోషాలను హరిస్తుంది.
అలాగే జీర్ణశక్తి లోపించిన వారు ప్రొద్దు తిరుగుడు గింజల తైలమును ప్రతిరోజూ తగినంత మోతాదులో సేవిస్తే జీర్ణశక్తి అభివృద్ధి చెందుతుంది. ప్రొద్దు తిరుగుడు చెట్టు ఆకులను నీడలలో ఎండించి చూర్ణం చేసి ఒక కప్పు పెరుగులో అర్థ చెంచా పొడిని వేసి దానిలో అర్థ కప్పు దానిమ్మ పండు రసం కలిపి చారు కాచినట్లు వేడి చేసి దించి రెండు మూడు చెంచాల నెయ్యి చేర్చి దించి రెండు పూటలా త్రాగుతుంటే ఆమ్లముతో (మురిగిన మలపదార్థములతో ) కడుపు నొప్పితో కూడి వేదించే ఆమ్ల విరేచనాలు త్వరగా తగ్గిపోతాయి.
ప్రొద్దు తిరుగుడు చెట్టు ఆకులు, పొట్ల చెట్టు ఆకులు ఈ రెండింటిని కలిపి ఆకుకూరలాగా వండి రెండు పూటలా తింటుంటే శరీరంలో చేరిక అధికమైన చెడు నీరు హరించి పోయి ఉబ్బురోగం హరించిపోతుంది.
ప్రొద్దు తిరుగుడు చెట్టు ఆకులు పొడి అర్థ చెంచా మోతాదుగా ఒక కప్పు వేడి పాలలో వేసి దానిలో ఒక చెంచా ఆవు నెయ్యి నాలుగు చెంచా త్రికటు చూర్ణం మిరియాలు సమంగా కలిపి నూరిన చూర్ణం కలిపి రెండు పూటలా సేవిస్తే దగ్గు, దమ్ము ఆయాసం, తగ్గిపోతాయి.
ప్రొద్దు తిరుగుడు చెట్టు వేరు బియ్యం కడిగిన నీటితో నూరి గంధం లాగా అరగదీసి ఆ గంధం ఒక టీస్పూను మోతాదుగా ఒక ఒక కప్పు బియయం కడిగిన నీటిలో కలిపి రెండు పూటలా సేవిస్తుంటే స్త్రీల సమస్యలు నివారణమవుతాయి.
తేలు కుట్టిన వెంటనే ప్రొద్దు తిరుగుడు చెట్టు ఆకును మెత్తగా నూరి రెండు ముక్కులతో బాగా వాసన చూడాలి. వాసన చూసిన తర్వాత మరుక్షణమే తేలు విషం నశించిపోయి నొప్పి, బాధ మంట వెంటనే తగ్గిపోతాయి. ప్రొద్దు తిరుగుడు చెట్టును సమూలంగా మెత్తగా దంచి ఆ ముద్దను రాత్రి నిదురించేఏ ముందు కాలి పగుళ్లపైన పట్టిస్తుంటే పగుళ్ళు పుండ్లు పూర్తిగా తగ్గిపోయి పాదాలు ప్రకాశవంతంగా ఆరోగ్యవంతంగా తయారవుతాయి.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







