గసగసాల కీర్‌

- November 11, 2016 , by Maagulf
గసగసాల కీర్‌

కావలసిన పదార్థాలు: గసగసాలు - అర కప్పు, నెయ్యి - ఒక టీ స్పూను, బాదం పప్పు - అర కప్పు, పంచదార - ఒక కప్పు, పాలు - లీటరు, తేనె - నాలుగు టీస్పూన్లు, యాలకుల పొడి - అర టీస్పూను, కిస్‌మిస్‌ - 20గ్రా, జీడిపప్పు - 20గ్రా. 

తయారుచేసే విధానం: నేతిలో గసగసాలు, జీడిపప్పు, బాదం పప్పులను వేగించి పొడిచేసుకోవాలి. మరుగుతున్న పాలలో గసగసాలు, బాదం, జీడిపప్పు పొడులను కలుపుకోవాలి. ఐదునిమిషాల తరువాత పంచదార, యాలకులపొడి వెయ్యాలి. చల్లబడిన తరువాత ముందుగా వేగించి పెట్టుకున్న కిస్‌మిస్‌ను, తేనెను వేసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com