కార్మిక హక్కుల్లో రాజీపడేది లేదు: సౌదీ అరేబియా
- November 11, 2016
న్యూఢిల్లీ: సౌదీ అరేబియా, కార్మికుల రక్షణ, భద్రత, హక్కుల పరిరక్షణ విషయంలో రాజీపడబోదని సౌదీ ఎంబసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఉద్యోగాల పేరుతో అభాగ్యుల్ని బానిసలుగా మార్చేందుకు సౌదీ వేదికగా మారుతోందన్న ఆరోపణల్ని ఎంబసీ ఖండించింది. అలాంటి చర్యలు ఏమైనా తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో పేర్కొంది. కార్మికుల కోసం చట్టాల్లో చాలా మార్పులు తెచ్చినట్లు తెలిపిన ఎంబసీ, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించింది. మనుషుల ఆక్రమ రవాణా విషయంలో ప్రపంచంలోనే అత్యంత కఠినంగా తాము వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, భారత ప్రభుత్వం అక్రమంగా విదేశాలకు వెళుతున్నవారిపై తీసుకుంటున్న కఠిన చర్యల్ని సౌదీ ప్రభుత్వం కొనియాడింది. సౌదీలో సుమారు 3 మిలియన్ల మంది ఇండియన్లు ఉన్నారనీ, అందులో ఇంజనీర్లు, డాక్టర్లు, ఐటి ఎక్స్పర్ట్లు ఉఉండటం గొప్ప విషయమని సౌదీ ఎంబసీ తెలిపింది. ఇరు దేశాల మధ్యా సన్నిహితసంబంధాలు ఉన్నాయనీ, రానున్న కాలంలో ఈ బంధం ఇంకా ధృడమవుతుందని సౌందీ ఎంబసీ ఆశాభావం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







