యూఏఈ ఇండియన్‌ బ్యాంక్స్ లో పాత నోట్లకు 'నో'

- November 12, 2016 , by Maagulf
యూఏఈ ఇండియన్‌ బ్యాంక్స్ లో పాత నోట్లకు 'నో'

భారతదేశంలో 500, 1000 రూపాయల పాత నోట్లు రద్దు కావడంతో, పాత నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల వద్ద బారులు తీరారు. అలాగే యూఏఈలోని భారతీయులు తమ వద్దనున్న పాత కరెన్సీని మార్చుకునేందుకు బ్యాంకులకు వెళుతున్నారు. అయితే కొన్ని బ్యాంకులు పాత నోట్లను అంగీకరించడంలేదు. దీనిపై సోషల్‌ మీడియాలో పలు వదంతులు స్ప్రెడ్‌ అవుతున్నాయి. వీటిపై స్పందించిన చార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ పంకజ్‌ ముంద్రా మాట్లాడుతూ ఆ మెసేజ్‌ని ఫేక్‌గా తేల్చారు. యూఏఈలో కేవలం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మాత్రమే యూఏఈలోని ఇండియన్‌ బ్యాంక్‌ అనీ, దీనికి మాత్రమే పూర్తిస్థాయిలో అన్ని అనుమతులూ ఉన్నాయనీ, ఇక్కడ మాత్రమే పాత నోట్ల ఎక్స్‌ఛేంజ్‌కి అనుమతి ఉందని తెలిపారు. ఇంకో వైపున ఈ బ్యాంకుకి భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇన్‌స్ట్రక్షన్స్‌ అందలేదు. భారతదేశం వెలుపల ఉన్న బ్యాంకులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇన్‌స్ట్రక్షన్స్‌ అందలేదని ముంద్రా తెలిపారు. 500, 1000 నోట్ల రద్దు వ్యవహారం విదేశాల్లోని భారతీయుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వివిధ పనుల నిమిత్తం విదేశాలకు వెళ్ళి వచ్చినవారు, పరిస్థితిని తెలుసుకుని షాక్‌కి గురవుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com