పెద్దనోట్ల రద్దు వల్ల ట్రాఫిక్ రూల్స్ కి అంతరాయం
- November 12, 2016
పెద్దనోట్లు చెల్లకపోవడంతో కేసులు నమోదుచేయడాన్ని ట్రాఫిక్ పోలీసులు తగ్గించారు. రూ.500, రూ.1,000 నోట్లు చెల్లని కారణంగా ప్రజల వద్ద నగదు కొరత ఏర్పడింది. రోజువారీ ఖర్చులకు కూడా ప్రజలు కష్టపడే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చెన్నైలో ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేయడం తగ్గించారు. ఇదివరకు ప్రతిరోజు 15 వేల కేసులకు పైగా నమోదుచేస్తుండగా, గత మూడు రోజుల నుంచి 2 వేలలోపే కేసులు నమోదవుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి నేరాలకు మాత్రమే కేసులు నమోదుచేస్తూ.. వాహనాల దస్తావేజులు, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, హెల్మెట్ ధరించకపోవడం తదితరాలను చూసిచూడనట్లు వదిలేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నగదు కొరత తీరిన తర్వాత యథావిధిగా కేసులు నమోదుచే యనున్నట్లు ఓ ట్రాఫిక్ పోలీసు అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







